![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -225 లో.....వీరు సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే వద్దని ప్రీతీ ఆపుతుంది. ఈ కుటుంబానికి సంబంధించిన వారసులు మాత్రమే బిజినెస్ చూసుకోవాలి.. మీరు కాదు. బిడ్డ పుట్టేంత వరకే మనం ఈ ఇంట్లో ఉంటాం.. ఆ తర్వాత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ప్రీతీ అంటుంది. ప్రీతి నేను చెప్పేది విను అని, నేను చెప్పేది వింటేనే కదా నేనేం అనుకుంటున్నానో తెలిసేది అని శకుంతల అంటుంది. మీరు నిన్న ప్రమీల చెప్పేది విన్నారా.. ఎవరినైనా మాట్లాడనిస్తే కదా తెలుస్తుందని రుద్ర అంటాడు. గంగ నువ్వు వెళ్లి ప్రమీలని తీసుకొనిరా అని రుద్ర అంటాడు. గంగ వెళ్లి ప్రమీలని తీసుకొని వస్తుంది. అసలు ఏం జరిగింది ప్రమీలా చెప్పమని రుద్ర అడుగుతాడు. దాంతో జరిగింది మొత్తం చెప్తుంది ప్రమీల. అది విన్న తర్వాత గంగ వంట అయిందా ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుంది తనకి బాక్స్ కావాలని పెద్దసారు అంటాడు. హా అవుతుందని గంగ అంటుంది.
నేను వద్దని చెప్పాను కదా అని శకుంతల అనగానే నేను నిర్ణయం తీసేసుకున్నాను అంతే అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక ఇషిక, వీరు ఉంటారు. వీరు ఒక్కనిమిషం.. నిన్న రాత్రి ప్రమీల వచ్చిన పదిహేను నిమిషాల తర్వాత నేను వచ్చాను.. కానీ నేడు పదిహేను నిమిషాల్లో నిర్ణయం మారిపోయింది. నీ చేతుల్లో నుండి సూపర్ మార్కెట్ బాధ్యతలు ప్రమీలకి మారాయి. అంటే ఎప్పటికి ధర్మమే గెలుస్తుంది వీరు అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. గంగ భోజనం రెడీ అయిందా అని రుద్ర అనగానే పప్పు కుతకుతా ఉడుకుతుంది అని గంగ అంటుంది. దాంతో వీరు, ఇషికకి పుండు మీద కారం చల్లినట్లుంది. రంగా అన్నయ్య తింటావా అని గంగ అనగానే వద్దులే చెల్లి కడుపు నిండిపోయిందని రంగా అంటాడు.
ఆ తర్వాత గంగని తీసుకొని రంగ, రుద్ర వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. గంగ తన కూతురు కాదని రుద్రకి తెలిసిందని లక్ష్మీ వాళ్ళు టెన్షన్ పడతారు. గంగని కాఫీని తీసుకొని రమ్మని చెప్తాడు రుద్ర. ఆ తర్వాత గంగ వాళ్ళ అమ్మనాన్నతో రుద్ర మాట్లాడతాడు. మీరు గంగని అపురూపంగా పెంచుకున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు గంగ కోసం చూస్తుంటారు కదా ఒకవేళ గంగ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన మీ ప్రేమ మర్చిపోదని రుద్ర అంటాడు. అప్పుడే గంగ ఎంట్రీ ఇస్తూ.. ఏంటీ ప్రేమ మర్చిపోదని అంటున్నారని గంగ అడుగుతుంది. ఏం లేదని రంగా కవర్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు సూపర్ మార్కెట్ కి కార్తీక్ వస్తాడు. నిన్న నేను డ్రాప్ చేసిన మీ మేడమ్ ఎక్కడ అని మక్కమ్ ని కార్తీక్ అడుగుతాడు. ప్రమీల మేడమ్ ని డ్రాప్ చేసింది మీరా.. అది ఇంట్లో వాళ్ళకి తెలిసి పెద్ద గొడవ అయిందట అని మక్కమ్ అంటాడు. అయ్యో తన పేరెంట్స్ అంత స్ట్రిక్ట్ ఆ అని కార్తీక్ అనగానే అయ్యో ప్రమీల మేడమ్ కూతురు కాదు పెద్దసారు వాళ్ళ కోడలు.. పాపం తన భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటుంది డైవర్ట్ చెయ్యడానికి తనని సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించారని మక్కమ్ చెప్తాడు. అయ్యో నేను తప్పు చేసానా అని కార్తీక్ అనుకొని ఇంకొకసారి సూపర్ మార్కెట్ కి రానని కార్తీక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |